క్యారెట్లను ఎలా పెంచుకోవాలి
క్యారెట్ల ను మిద్దెతోట లో ఎలా పెంచుకోవాలి తెలుసుకుందాం..
చలికాలం క్యారెట్లు పెరగడానికి మంచి వాతావరణం..
విత్తనాలను ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నాటుకోవాలి..
వర్షాకాలంలో కూడా ఇవి పెరుగుతాయి..
ఎండాకాలం మధ్య నుంచి చివరి వరకు విత్తనాలు నాటుకోవాలి..
క్యారెట్లు బాగా పెరగాలంటే మూడు నుంచి నాలుగు గంటల సూర్యకాంతి అవసరం..
తోట మట్టి కంటే వదులుగా (లూస్ సాయిల్ ) ఉన్న నేలలో బాగా పెరుగుతాయి..
ఇసుక, కొంచెం మట్టి, ఎండిన ఆకులు కానీ లీఫ్ కంపోస్టు కానీ, కొద్దిగా ఎరువులు కలిపి ఉంచుకోవాలి..
క్యారెట్ల కు తక్కువ నైట్రోజన్, మితమైన ఫాస్ఫరస్,అధిక పొటాషియం అవసరం..
నైట్రోజన్ ఎక్కువ ఉంటే ఆకులు ఎక్కువ పెరుగుతాయి..
క్యారెట్లు పెద్దవిగా పెరగవు..
క్యారెట్లను కనీసం ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్ లో నాటుకోవాలి..
విత్తనాలను నేరుగా మట్టిలో విత్తుకోవాలి..
నారు పోసి నాటుకుంటే మొక్కలు సరిగా పెరగవు..
హైబ్రిడ్ విత్తనాల కంటే దేశీ విత్తనాలను విత్తుకోవాలి..
ఈ మొక్కల నుంచి తిరిగి విత్తనాలు సేకరించుకోవచ్చు..
క్యారెట్ల విత్తనాలు రకరకాల రంగులలో దొరుకుతాయి..
కావలసిన విత్తనాలను మట్టిలో లోతుగా నాటకూడదు..
ఒకేచోట రెండు మూడు విత్తనాలు నాటాలి..
అవి మొలకెత్తి రెండు అంగుళాలు పెరిగిన తర్వాత బలమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలు తీసేయాలి..
ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మూడు అంగుళాల దూరం ఉంచాలి..
వీటికి పెరుగుతున్న దశలో మల్చింగ్ చేయాలి.. (ఎండిన ఆకులు లేదా పూలు, కొమ్మలు లాంటివి)..
క్యారెట్లు బాగా పెరగడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మరియు వేప పిండి వేయాలి..
వీటికి క్రమం తప్పకుండా నీళ్ళు పోయాలి..
అలా నీళ్ళు పోయడం వలన ఆక్సిజన్ లెవెల్స్ సరిగా ఉండి తెల్లని అచ్చు లాంటి ఫంగస్ క్యారెట్ల వేర్లకు సోకకుండా ఉంటుంది..
క్యారెట్లు పూర్తిగా పెరగడానికి రెండు మూడు నెలల సమయం పడుతుంది..
క్యారెట్స్ కు సోకే వ్యాధులు
- ఆస్టర్ ఎల్లోస్
క్యారెట్లలో పసుపు ఆకులు ఉంటాయి..
ఈ వ్యాధి లీఫ్ హాపర్ల వలన కలుగుతుంది..
ఈ వ్యాధి సోకిన మొక్కల క్యారెట్లు చేదు రుచిని కలిగి ఉంటాయి..
ఈ వ్యాధిని నియంత్రించడానికి
తోటలో చెత్త లేకుండా చూసుకోవాలి..
వేపనూనె పిచికారి చేయాలి...
- ఆకు ముడత(సెర్కోస్పోరా లీఫ్ బ్లైట్)
ఇది ఫంగస్ వలన వస్తుంది..
- ఆకుమచ్చ(ఆల్టర్నేరియా ఫ్లైట్)
ఇది ఫంగస్ వలన వస్తుంది..
ఫంగస్ వ్యాధులకు నివారణ ఇంతకుముందు చెప్పినట్టుగా బేకింగ్ సోడా ద్రావణం కానీ పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని కానీ వేపనూనె కానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను కానీ పిచికారి చేయాలి..
బూజు తెగులు
ఆకుల మీద తెల్లటి పొడి పెరుగుదల కనిపిస్తుంది.. ఆకులు గోధుమ రంగులోకి మారతాయి..
నివారణ
పాలు కానీ పుల్లటి మజ్జిగ కానీ పిచికారి చేయాలి..
క్యారెట్ శీతాకాలపు పంట..
వెచ్చని వాతావరణంలో క్యారెట్ లను పెంచడం వలన అనేక సమస్యలు వస్తాయి..
క్యారెట్లకు వచ్చే వ్యాధులు వ్యాధి కారకంతో సంబంధం లేకుండా తరువాతి పంటకు సోకకుండా ఉండడానికి పంట భ్రమణం చేయాలి..
క్యారెట్లను నాటిన ప్రదేశంలోనే వేరే పంటలను పండించాలి..
కనీసం మూడు సంవత్సరాలు ఒకే చోట క్యారెట్ లను నాటకూడదు..
ఈవిధంగా క్యారెట్లను మిద్దె తోట లో పండించుకోవచ్చు..
ఇట్లు
లత
Leave your comment