Gardening is an Immunity Booster
మొక్కలు పెంచడవల్ల మనకు ఇమ్యూనిటి పెరుగుతుంది అని మీకు తెలుసా!
మొక్కలు పెంచితే ఇమ్మ్యూనిటి ఎలా పెరుగుతుంది? ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అందరూ తెలుసుకోవలసిన విషయం ఇది. మొక్కలు పెంచాలంటే మనం మట్టిని మన చేతులతో తాకాలి. నీళ్ళు తేవాలి. పెరటిలో నో, తోటలోనో, రోజు కనీసం గంట సేపైనా గడిపాలి.
ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా! ఉదయ సమయం లోని ఎండ, లేదంటే సాయంకాలపు ఎండ మీ మీద పడుతుంది. అది మీలో D- విటమిన్ తయారు చేస్తుంది. ఇప్పుడు మనదేశం లో గొప్పగా చదువుకున్నాం అనుకుంటున్న వారిలో సగం మంది ... D- విటమిన్ లోపంతో ఉన్నారట.
మీకు ఆ భాద ఉండదు, మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే...
మరి D- విటమిన్ వల్ల ఇమ్మ్యూనిటి వస్తుందా అంటే ! వస్తుంది. మొక్కలు పెంచే సమయం లో మీరు చేసే శారీరక శ్రమ వల్ల , D- విటమిన్ వల్ల కలిగే ప్రయోజనం కన్న ....... మొక్కలు పెంచెప్పుడు మనకు ఇమ్యునిటి ను కలిగించే అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అది చాలా మందికి తెలియదు. మనం మట్టి తో పని చేస్తున్నప్పుడు, నీరు తెచ్చి మొక్కలకు పోస్తున్నపుడ్డు మట్టి లో , నీటిలో ఉండే అనేక సూక్ష్మ జీవులు మన శరీరం లోకి ప్రవేశిస్తాయి. అదీ మనలో (వ్యాధి నిరోధకత ,) ఇమ్యునిటి పెరగడానికి అసలు సిసలైన కారణం.
సూక్ష్మజీవుల మన శరీరం లోకి వెళితే ప్రమాదం కదా అని మీకు అనిపిస్తుంది. ఇది అర్థం కావాలంటే సూక్ష్మ జీవులు మూడు రకాలని తెలుసుకోవాలి. కొన్ని సూక్ష్మజీవులు మనకు హాని చేసినట్టే... మనకు మేలు చేసి మనతో కలిసి బతికే సూక్ష్మ జీవులు ఉంటాయి. అలాగే మనకు నష్టం గానీ , లాభం గానీ కలిగించని కోట్ల సంఖ్యలో సుక్ష జీవులు మట్టిలో, నీటి లో ఉంటాయి. ఇందులో ఏ సూక్ష్మ జీవి మన శరీరం లోకి చేరినా... మన శరీరం చూస్తూ ఊరుకోదు. వీటిని ఎదుర్కొంటుంది. మన దేశం కి సైన్యం ఉన్నటే . మన శరీరం లోకుడా పెద్ద సైన్యం ఉంటుంది. మనకు హాని కలిగించే వాటిని అవి చంపేస్తాయి. మన శరీరం వాటిని చంపెయ్య గలిగినప్పుడు మనకు వ్యాధులు రావు! మనం వ్యాధికి గురయ్యాం అంటే మన శరీరం లోని సైన్యం ఆ ఒక సూక్ష్మ జీవిని గెలవలేక పోయిందని అర్థం.
మాన శరీరం యెన్ని సూక్ష్మ జీవులను ఆప గలిగితే మనకు అంత ఇమ్మునిటి ఉన్నట్టు. బాగానే ఉంది ! మరి మట్టిలో, మొక్కలతో పనిచేస్తే మన శరీరానికి ఇమ్మ్యూనిటి ఎలా వస్తుంది!
సూక్ష్మ జీవులు మన శరీరం లోనికి ప్రవేశించి నప్పుడు అవి హానికరం అయినవి అయితే వాటితో మన శరీరం యుద్ధం చేస్తుంది...o.k, మరి మనకు హాని చేయనివి, మేలు చేసేవి ఉన్నాయి కదా! అవి మన శరీరం లోకి వస్తేవాటిని ఏంచెస్తుంది?
మనకి ఉపయోగపడే సూక్ష్మ జీవులను మన శరీరం లో ఉండనిస్తుంది. వాటిని పెంచుతుంది. అలా మన శరీరం లో కొన్ని కోట్ల సూక్ష్మ జీవులు పెరుగుతున్నాయి...
ఆశ్చర్య పోవద్దు, మనం అలాంటి సూక్ష్మ జీవుల ను రోజూ మన ఇంటిలో పెంచుకొని తింటున్నాం...
మీరు తినే పెరుగు, మజ్జిగ అలాంటివే.. బ్యాక్టీరియా లే పెరుగును తయారు చేస్తాయి. అలాంటి ఉపయోగ పడే బ్యాక్టీరియా లు చాలానే ఉన్నాయి.
మన పేగుల్లో ఉండి మనం అందించే ఆహారాన్ని ఉపయోగించుకుంటూ మనకు విటమిన్లు తయారు చేసి ఇచ్చే బ్యాక్టీరియా లు కూడా ఉన్నాయి. అంటే మనం బయట ఆవుల్నీ పెంచుకున్నట్టే లోపల సూక్ష్మ జీవులను పెంచుకుంటూ ఉన్నాం. వీటన్నింటినీ గట్ ఫ్లోరా అంటుంటారు. కొన్ని సూక్ష్మజీవులు మనకు హాని కలిగించే వాటిని చంపేసి మనం రోగాల బారిన పడకుండా కాపాడుతూ ఉన్నాయి.
ఇలా మేలు చేసే వాటిని, కీడు చేసే వాటిని , మనకు ఏవిధంగా గా సంబంధం లేని వాటిని... మన శరీరం గుర్తించ గలదు...
తరతరాలుగా మట్టిలో జీవించిన మన పూర్వీకుల నుంచి ఆ జ్ఞానం మన శరీరానికి వచ్చింది.
మనకు ఉపయోగ పడే సూక్ష్మ జీవుల తో సహా శరీరం లోకి ప్రవేశించిన ఏ ప్రాణిని మన శరీరం ఊరికినే వదలదు. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఫోటోలు తీసి జాగ్రత్త చేస్తుంది. దానిని ఏవిధంగా బందించి ఉంచచ్చో, యెలా చంపోచ్చో... ఎలా కట్టడి చేయ్యోచ్చో సిద్దం చేసుకుంటుంది. అలా చేయడం ద్వారా ఇంకా మన శరీరం లోకి ప్రవేశించ పోయినా కూడా ... ఇతర వ్యాధి కారక సూక్ష్మ జీవుల లక్షణాలను .ఏనా శరీరం అంచనా వేసి యుద్దానికి సిద్దం గా ఉంటుంది. చాలా సూక్ష్మ జీవులకు మద్య శరీర నిర్మాణం లో పోలికలు ఉంటాయి. అందుకే మన శరీరం అన్ని సూక్ష్మ జీవులను స్టడీ చేస్తూనే ఉంటుంది.
మన వాళ్ళు మనకు జబ్బులు రాకుండా వాక్సిన్ లు వేస్తుంటారు. అవి పని చేసేది కూడా ఇలాగే.. పోలియో వాక్సిన్ అంటే ఎంటనుకుంటున్నారు.. చంపేసి న పోలియో కలిగించే సూక్ష్మ జీవులే.
వాటిని ఒక సారి మన శరీరం లోకి పంప గానే మన శరీరం చచ్చిపోయి ఉన్న ఆ సూక్ష్మ జీవులను కూడా స్టడీ చేసేసి.. నిజం గా బతికి ఉన్నవి వస్తె యెలా చంపాలో రెడీ అయిపోతుంది. అదే మరి ... ఇమ్మ్యూనిటి అంటే...
అంటే ఇమ్మ్యూనిటి రావాలంటే మన శరీరం లోకి సూక్ష్మజీవులు ప్రవేశించాలి.
ఇలాంటి సూక్ష్మజీవులు నీవు మొక్కలతో తోటలో కాసేపు పనిచేస్తే నీ శరీరంలోకి చేరతాయి కానీ.. నువ్వు AC room లో , సానిటైజ్ చేసిన గదుల్లో ఉండిపోతే కాదు.
మరి మీరు అడగొచ్చు... తోటలో మట్టితో గడుపుతున్న సమయం లో హాని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉందికదా! అందుకని మట్టిలో కి వెళ్ళాక పోవడమే మంచిది కాదా అని.
మీకు అనిపించే ఈ విషయం తాత్కాలికం గా బాగున్నట్టూ అనిపిస్తుంది.
మీకు నిజం తెలిసే లా చెబుతాను.
కోళ్ళ ఫోరమ్ లోని కోడి కి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ముక్కు దగ్గరకి ఆహారం వచ్చేస్తుంది. శుభ్రమైన నీరు, వారం వారం సనిటైజేషన్, జబ్బులు రాకుండా మందులు, ఎండ పొడ తగులుతుందని ఎయిర్ కూలర్ లు కూ డా ఇప్పుడు ఆ కొళ్లకి అందుబాటులో ఉన్నాయి. ఎంత అదృష్టం !
మనుషులు ఇప్పుడు చాలామంది, ముఖ్యం గా చదువుకున్న వాళ్ళూ చాలా మంది కోరుకుంటున్న జీవితం అలాంటిదే. కాదంటారా! అదృష్టమే నా ఆ జీవితం.! కటింగ్ కి మాత్రమే సూట్ అవుతుంది.. ఆ ఫోరమ్ కోడి.. కత్తి చేతితో పట్టుకూన్న వాడు తనపక్కనే వందల కోళ్ల పీకలు కొస్తున్నా ... అది కదలకుండా నుంచొని చూస్తుంది. కొట్టినా పరిగెత్తాలేని స్థితికి చేరిపోయింది... ఆ దురదృష్ట జీవి.
మనం కోరుకుంటుందీ అటువంటి సుఖవంతమైన, నిర్ధకమైన జీవితాన్నే నా! అదే అయితే... మట్టికి దూరం గా ఉండండి. శ్రమపడటం అనేది కేవలం చదువుకొని వారు, తింగరి వారు మాత్రమే పడే బాధ అని భావించి మీరు సుఖవంతమైన జీవిత గురించి మాత్రమే అలోచిస్తూ ఉండండి. మీకు ఫోరమ్ కోడికి ఏ తేడా ఉండదు.
ఇంట్లో మనం పెంచుకొనే కోడిని చూసారా! దానిని పట్టుకోవాలి అంటే ... ఉదయం అది కోళ్ల గూడు దాటక ముందో.. రాత్రి అది గూటిలో ఉన్నపు డో అయితే బెటర్... పగలు దొరుకుతుందా అండి అదీ.. మనం ఎన్నో ప్లాన్లు వెయ్యాలి దాన్ని పట్టుకోడానికి... అడవి కోడిని మీరు ఎవరైనా చూసారా! ఉన్నాయండీ... ఇప్పటికీ అడవిలో కోళ్లు ఉన్నాయి . వాటిని పట్టుకోవాలని అనుకుంటే వేటాడటం తప్ప మార్గం లేదు. అన్ని కోళ్లే కదా! ఏంటి ఇంత వ్యత్యాసం. అవి పెరిగిన తీరు... అవి బ్రతికిన తీరు.. పోరాడే స్వభావమే గొప్ప శక్తి. ఫోరమ్ కోడికి చాలా గొప్ప లక్షణాలుంటాయి... ఎక్కువ మాంసం, ఎక్కువ గుడ్లు ఇవ్వగలదు అవి దానికి పనికొచ్చే లక్షణాలు కాదు. మనకి పనికొచ్చేలా మనం తయారు చేశాం దానిని. దాని జీవితం దానిది కాదు. అదే అడవి కోడి లక్షణాలు దానికి కావలసిన లక్షణాలు.. అదే ఆహారాన్ని సంపాదించుకుంది. అదే దాని పిల్లల్ని పెంచుకుంటుంది. తనను తాను రక్షించు కుంటుంది. దాని జీవితం దానిదే.. ప్రకృతి చెక్కిన శిల్పం దాని జీవితం. దాని గొప్పతనం దాని పోరాడే శక్తి. మనం కచ్చితంగా గా ఆలోచించుకోవాలి, మన జీవితం మనదేనా అని...!
ఆలోచించండి
మీ జీవితం మీదేనా! వ్యాపార ప్రకటనల తో ఉత్తేజితం అయ్యి! కంపెనీ ల పరమైపోయి, ప్రకృతిని వదిలిపెట్టి , ప్యాకింగ్ ఫుడ్, ప్యాకింగ్ వాటర్, ప్యాకింగ్ నిద్ర, ప్యాకింగ్ చావు...
మిత్రులారా గో బ్యాక్ టు ద నేచర్. మట్టి లోకి వెళ్లండి... నీచేటులతో విత్తులు నాటండి. సూక్ష్మ జీవులకూ మనకు సహజీవనం ఈ నాటిది కాదని గుర్తించండి. నిన్ను కలవరపెడుతున్న సూక్ష్మజీవి ని కూల్చ గల శక్తి నీ శరీరానికే వస్తుంది.. పోరాటం దాని సహజ లక్షణం. దానికి తోడ్పాటు ను ఇవ్వండి. మన శత్రువులైన సూక్ష్మ జీవులను చంపేసే మిత్ర సూక్ష్మ జీవులు కూడా ఉంటాయని గుర్తించండి. అన్నింటినీ సానిటైజ్ చేస్తూ పోతే మనం పోరాటం లో ఒంటరి వారైపోతాము. కాబట్టి మిత్రులను కూడగట్టి పోరాటానికి ఎప్పుడూ సిద్దం గా ఉండండి.
మీ మిత్రులు మట్టిలో... మొక్కల తోటలో ఉన్నారు . వెళ్ళి కలవండి.
Leave your comment